Thursday, February 2, 2023
Thursday, February 2, 2023

జాతీయ మహాసభకు తరలిరండి.. ఎమ్మార్పీఎస్ నాయకులు

విశాలాంధ్ర – ధర్మవరం ; బెంగళూరు నగరంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఈనెల 11న మందకృష్ణ మాదిగ నాయకత్వంలో జరుగు జాతీయ మహాసభకు అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు మహాజన సోషలిస్ట్ పార్టీ నాయకులు భూదప్ప, మాదిగ జిల్లా కార్యదర్శి గజ్జల రామాంజనేయులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం పట్టణములో పలుచోట్ల ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బెంగళూరులో జరుగు జాతీయ మహాసభకు ఉమ్మడి సత్యసాయి జిల్లా ధర్మవరం నుండి ఎంఎస్పి, ఎమ్మార్పీఎస్, ఎంఈఎఫ్, ఎమ్మెస్ ఎఫ్, వాటి అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు వందల సంఖ్యలో సభలో పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముదిగుబ్బ మండలం నాయకులు కోటప్ప, తాడిమర్రి నాయకులు రామాంజనేయులు తో పాటు తిరుమలేష్, నారాయణ, నల్లప్ప, సుధాకర్, ప్రసన్న, శ్రీనివాసులు, వెంకటేష్, నరసింహులు, లక్ష్మీనారాయణ, ఆటో సత్తి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img