Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

జాతీయ స్థాయి బేస్‌ బాల్‌ పోటీలకు ఆశ్రమ పాఠశాల విద్యార్థి ఎంపిక

విశాలాంధ్ర-నల్లమాడ : స్థానిక ఆశ్రమ పాఠశాల విద్యార్థి కె.కుళ్లాయప్పనాయక్‌ జాతీయస్థాయి బేస్‌బాల్‌ పోటీలకు ఎంపికైన ట్లు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సతీష్‌ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 4 వ తేదీన నంద్యాల డిగ్రీ కళాశాలలో జరిగిన బేస్‌ బాల్‌ పోటీలలో ప్రతిభ చూపడంతో జాతీయ స్థాయి క్రీడా పోటీలకు ఎంపికైన ట్లు తెలిపారు. దీంతో ఈ నెల27 నుంచి 30 వరకు కేరళలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనున్నట్లు పీ.డి.యన్‌ ధరణి తెలిపారు. డిటిడబ్ల్యూ అన్నదొర, డీఎస్‌ టిబ్ల్యూ మోహన్‌ రామ్‌,హెచ్చ్‌ బ్ల్యూఓ సత్యనారాయణ, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img