Friday, March 31, 2023
Friday, March 31, 2023

జిల్లా స్థాయి క్విజ్ పోటీలలో రెండవ స్థానం కైవసం చేసుకున్న శ్రీ సత్య కృప మహిళా డిగ్రీ కళాశాల

విశాలాంధ్ర- ధర్మవరం: అనంతపురం జిల్లా స్థాయిలో క్విజ్ కాంపిటీషన్ పోటీల్లో పట్టణానికి చెందిన శ్రీ సత్య కృప మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులు రెండవ బహుమతిని కైవసం చేసుకోవడం జరిగిందని ప్రిన్సిపాల్ పెద్దారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం వారు మాట్లాడుతూ అనంతపురం జిల్లా స్థాయిలో క్విజ్ పోటీలలో రెండవ స్థానం రావడం గర్వకారణంగా ఉందని, రెండవ స్థానంలో ఎస్. పవిత్ర, డి. భారతి, జి. జాగృతిక, ఎల్. మౌనిక జి. వైష్ణవి రావడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఆ విద్యార్థులు అందరినీ కూడా పెద్దిరెడ్డి అధ్యాపకులు నాగ ప్రవీణ తదితరులు అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img