Saturday, June 3, 2023
Saturday, June 3, 2023

జూనియర్ సాఫ్ట్ బాల్ బాల బాలికల జట్ల ఎంపిక

విశాలాంధ్ర-రాప్తాడు : అన్నమయ్య జిల్లా టి.సుండుపల్లి జెడ్పీహెచ్ఎస్ లో మే 26 నుండి 28వ తేదీ వరకు జరగనున్న రాష్ట్రస్థాయి సాఫ్టుబాల్ పోటీల్లో పాల్గొనే అనంతపురం జిల్లా బాలబాలికల జట్లను శనివారం ఎంపిక చేశారు. ఈసందర్భంగా అనంతపురం ఆర్డీటీ స్టేడియంలో జట్ల ఎంపికల పోటీలను నిర్వహించగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 200 మంది క్రీడాకారులు హాజరయ్యారని ఏపీ సాఫ్టుబాల్ సంఘం సీఈఓ సి.వెంకటేసులు తెలిపారు. ముఖ్య అతిథులుగా ఆర్డీటీ గ్రాస్ రూట్ లెవెల్ కో-ఆర్డినేటర్ ఓబులేసు హాజరై ఎంపికలను పర్యవేక్షించారు. సాఫ్ట్ బాల్ క్రీడ దేశంలోనే అత్యున్నత స్థానంలో ఉందని, అందులో ఆంధ్రప్రదేశ్, అనంతపురం జట్లు ప్రథమ ద్వితీయ స్థానంలో రాణిస్తుండడం హర్షణీయమన్నారు. ఇందుకోసం కృషి చేస్తున్న ఏపీ సాఫ్ట్బాల్ సంఘం, ఆర్టీసీ సంస్థల సహకారం అత్యున్నతమైనదన్నారు. సి.వెంకటేసులు మాట్లాడుతూ,ఈ క్రీడ ద్వారా ఎంతో మంది క్రీడాకారులు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఉన్నత స్థానాల్లో ఉన్నారని, గత పదేళ్ళలో ఈ క్రీడ ఉన్నతమైన స్థానంలో నిలవడానికి ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంచూ ఫెర్రర్ ఇస్తున్న సహకారం మరువ లేనిదన్నారు. రాష్ట్రస్థాయి జూనియర్ సాఫ్ట్ బాల్ క్రీడా పోటీలకు ఎంపికైన అనంతపురం జిల్లా బాలబాలికల జట్లు విజయంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా సాఫ్టుబాల్ సంఘ సభ్యులు ఎన్. కేశమూర్తి, పీడీలు కె.గోపాల్ రెడ్డి, పక్కీరప్ప, ప్రభాకర్, లతాదేవి, హిమబిందు, రామాంజనమ్మ, గంగ, కోచ్ లు బద్రి, సాయిదీక్షిత్ సాయి, శివాజీ, లోకేష్, లక్ష్మి పాల్గొన్నారు.

బాలుర జట్టు
శశి, బుడగల అక్షయ్ సాగర్, అరవింద్, అరవింద్ రెడ్డి, జగదీష్, సాయి, రంజిత్, ముబారక్, నరసింహ, గణేష్, అంజి, సునీల్, సాయికుమార్, బస్వంత్, మనోహర్, భాను, శంకర్, సాయికుమార్, మోక్షిత్ వర్మ ,సాదిక్.

బాలికల జట్టు

రాజేశ్వరి, అనూష, శిరీష, అమిదాబి, గౌరీప్రియ, ఉషారాణి, కీర్తన, మౌనిక, కల్పన, లోహిర, అనూష, హేమలత, ఫాతిమా, షబీనా, మౌనిక.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img