Wednesday, February 1, 2023
Wednesday, February 1, 2023

టీడీపీకి ఉప్పర వెంకటేష్ సేవలు ఎనలేనివి

విశాలాంధ్ర-రాప్తాడు ..మండల పరిధిలోని జి.కొత్తపల్లి పంచాయతీ గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు దివంగత ఉప్పర వెంకటేష్ టీడీపీకి చేసిన సేవలు ఎనలేనివని గాండ్లపర్తి సర్పంచ్ తలారి నరేష్ కొనియాడారు. మొదటి వర్ధంతిని శుక్రవారం కుటుంబ సభ్యులు, టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా ఉప్పర వెంకటేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులు గాండ్లపర్తి జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులకు, పుస్తకాలు, అట్టలు, పెన్నులు పంపిణీ చేశారు. అదేవిధంగా రూరల్ మండలంలోని కాట్నేకాలువ వద్ద ఉన్న ఆశ్రయ అనాథాశ్రమం, అనంతపురం పట్టణంలోని కమలానగర్ లో ఉన్న ఆదరణ సేవా ట్రస్టులో ఆశ్రయం పొందుతున్న అనాథలకు అన్నదానం చేశారు. పరిటాల కుటుంబానికి నమ్మికమైన వ్యక్తిగా ఉంటూ ఎలాంటి పదవులు ఆశించకుండా టీడీపీ బలోపేతం కోసం నిరంతరం కష్టపడి పనిచేస్తూ బ్రతికినంత కాలం అదేపార్టీలోనే కొనసాగినారన్నారు. ఈ కార్యక్రమంలో ఉప్పర వెంకటేష్ సతీమణి, జి.కొత్తపల్లి మాజీ సర్పంచ్ ఉప్పర చంద్రకళ, టీడీపీ ట్రేడ్ యూనియన్ మండల అధ్యక్షులు సోమర నారాయణస్వామి, మాజీ డీలర్ సత్యనారాయణ, ఉప్పర నరేష్, కార్తీక్, అశ్విని హరిత, వసంత తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img