Sunday, April 2, 2023
Sunday, April 2, 2023

టైలర్ లకు ఆర్థిక సహాయం పట్ల హర్షం

విశాలాంధ్ర -ఉరవకొండ : టైలర్లు యొక్క ఆర్థిక సమస్యలను గుర్తించి గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రతి ఏడాది పది వేల రూపాయలు తమ ఖాతాల్లో జమ చేయడం పట్ల ఉరవకొండ పట్టణ టైలర్స్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేశారు. శనివారం ఉరవకొండలో అసోసియేషన్ ఆధ్వర్యంలో వైస్ రాజశేఖర్ రెడ్డి ,విగ్రహానికి పూలమాలలు వేసి జగన్మోహన్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఉరవకొండ లో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డిని ఎమ్మెల్యే గా గెలిపించి తమ రుణం తీర్చుకుంటామని అన్నారు.ఈ కార్యక్రమంలో టైలర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు,మాక్బుల్,సాగర్ వెంకటరమణ, మహేష్,లాలూ,వన్నూరుస్వామి,మాస్టర్ టైలర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img