విశాలాంధ్ర.. ధర్మవరం : డాక్టర్ బాబు జగ్జీవన్ రాం 116వ జయంతి వేడుకలను పురస్కరించుకొని ధర్మవరం కేంద్రంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి శ్రీ సత్య సాయి జిల్లా అధ్యక్షులు శెట్టిపి జయచంద్రారెడ్డి పూలమాలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అలుపెరుగని సమరం సాగించిన సామాజిక విప్లవ యోధుడు, నిర్వహించిన ప్రతి మంత్రిత్వ శాఖకు ప్రత్యేక ముద్ర వేసి గొప్పతనాన్ని తీసుకువచ్చిన మహనీయులు గొప్ప వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ సేవలను కొని యా డారు. వారి అడుగుజాడల్లో ఆ రందరూ నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో ధర్మవరం యుటిఎఫ్ జోన్ నాయకులు రామకృష్ణ నాయక్, ఆంజనేయులు, లక్ష్మయ్య, రాంప్రసాద్, బిల్లే రామాంజనేయులు, హెచ్ రామాంజనేయులు,ఆదిరెడ్డి, అమర్ నారాయణరెడ్డి, లక్ష్మీనారాయణ, అమర్నాథ్ రెడ్డి, వి.. రామాంజనేయులు, నాగేశ్వర్ రెడ్డి, హరిశంకర్, కృష్ణ తేజ, వేణుగోపాల్, శ్రీధర్ బాబు,తదితరులు పాల్గొన్నారు.