Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

డెంగ్యూ లక్షణాలతో బాలుడు మృతి…

విశాలాంధ్ర` ఉరవకొండ : అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణం శివరాం రెడ్డి కాలనీకి చెందిన మనోహర్‌(7) అనే బాలుడు డెంగ్యూ, టైఫాయిడ్‌ లక్షణాలతో శనివారం ఉదయం మృతి చెందారు. ఈ సంఘటనపై బాలుడు తల్లిదండ్రులు బుడగ జంగం లక్ష్మీ, చిన్న మాట్లాడుతూ తమ కుమారునికి ఈనెల 14వ తేదీన జ్వరం వచ్చిందని ఉరవకొండ లో ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స చేయించమని జ్వరం తగ్గక పోవడంతో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని అక్కడ వైద్యులు పరీక్షలు నిర్వహించి డెంగ్యూ లక్షణాలు ఉన్నాయని బెంగుళూరు కి తీసుకెళ్లాలని చెప్పడంతో తమకు స్తోమత లేక బళ్లారి ఓపిడికి తీసుకెళ్లామని అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు వారు తెలిపారు. బాలుడు మృతి సంఘటనతో శివరాం రెడ్డి కాలనీలో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ప్రస్తుతం విష జ్వరాలు, టైఫాయిడ్‌ మలేరియా, డెంగ్యూ వ్యాధులు విజృంభిస్తుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వ్యాధులు వ్యాపించకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని కాలనీ ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img