Sunday, February 5, 2023
Sunday, February 5, 2023

తప్పుడు తూకాలు వేస్తే కఠిన చర్యలు తప్పవు… ఆర్డీవో తిప్పెనాయక్

విశాలాంధ్ర – ధర్మవరం : ప్రభుత్వ చౌక ధాన్యపు డిపోలలో స్టోర్ డీలర్లు తక్కువ తూకాలు వేస్తే, కఠిన చర్యలు తప్పవని ఆర్డిఓ తిప్పే నాయక్ హెచ్చరించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఇటీవల స్టోర్ డీలర్ల పై వస్తున్న ఫిర్యాదుల సందర్భంగా పట్టణంలోని 19, 20 స్టోర్ లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వీరి వెంట సి ఎస్ డి టి చెన్నకేశవ నాయుడు కూడా ఉన్నారు. అనంతరం ప్రభుత్వ చౌక ధాన్యపు స్టోర్లలో ప్రస్తుతం ఉన్న స్టాకు, వాటి ధరలను, తూకాల కొలతలను వారు పరిశీలించారు. ప్రస్తుతం కంది బ్యాలు నాణ్యత సరిగా లేదన్న అపోహలను కార్డుదారులు నమ్మవద్దని, నా ఆకస్మిక పరిశీలనలో కంది బ్యాళ్లు నాణ్యతగా ఉన్నాయని వారు తెలిపారు. అదేవిధంగా స్టోర్ డీలర్లు తమ స్టోర్ కు ముందు బాగానే బోర్డును ఏర్పాటు చేసి, అందులో స్టాకు, నిత్యావసర ధరలను తప్పనిసరిగా రాయాలని ఆదేశించారు. నిరుపేదలకు అందించే బియ్యము, తదితర వస్తువుల పంపిణీలో తూకంలో తేడాలు వస్తే, డీలర్పై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వీఆర్వో యోగేశ్వర్ రెడ్డి, స్టోర్ డీలర్ సంఘం అధ్యక్షులు పరందామరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img