Monday, January 30, 2023
Monday, January 30, 2023

తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు ఆరు లక్షలు తానా ఆర్థిక వితరణ…

విశాలాంధ్ర-జె ఎన్‌ టి యు ఏ : శె ట్టూరు మండలం బసంపల్లి గ్రామానికి చెందిన చిన్నారులు అశ్విని, లక్ష్మి తల్లిదండ్రులు కోల్పోయే నిరాశ్రయులుగా ఉన్న విద్యార్థులకు తానా ఫౌండేషన్‌ ట్రస్ట్‌ పురుషోత్తం చౌదరి ఆరు లక్షల రూపాయలు చెక్కును బుధవారం కమ్మ భవనంలో విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదరిక నిర్మూలన, విద్య, వికాసం, ఉపాధి కల్పన అందించేందుకు తానా ఫౌండేషన్‌ ట్రస్ట్‌ లక్ష్యసాధన అని అన్నారు. ఏపీ ,తెలంగాణలో మరిన్ని సామాజిక సేవ కార్యక్రమాల్లో చేయనున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ బాలాజీ ఎంబీఏ కళాశాల ప్రిన్సిపల్‌ డా.ఎం సుబ్బారావు,సి. కొండయ్య, సరిపోటి నారాయణ, అమ్మిలినేని వెంకటసుబ్బయ్య, ఆచార్య నారాయణ, శ్రీరాములు, రామచంద్ర పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img