Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

తల్లిదండ్రుల విరాళముతో విద్యార్థులకు అల్పాహారం.. పాఠశాల హెచ్ఎం.. ఉమాపతి

విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని బిఎస్సార్ పురపాలక బాలికల ఉన్నత పాఠశాల ఇప్పటికే ఏపీలో పదవ తరగతి పరీక్షా ఫలితాలలో మంచి గుర్తింపు పొందడం జరిగింది. ఇందు గాను ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తో పాటు మున్సిపల్ చైర్మన్ లింగం నిర్మల, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, వార్డు కౌన్సిలర్, మరింత ప్రోత్సాహం ఇస్తూ విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నారు. నేటి పదవ తరగతి పరీక్షలకు విద్యార్థినిలు అందరూ కూడా సంసిద్ధం కావడానికి, సాయంత్రం పూట ఆదనపు తరగతులు నిర్వహించడంతోపాటు వారికి అల్పాహారం దాతల సహాయ సహకారాలతో పాఠశాల హెచ్ఎం. ఉమాపతి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ఇందులో భాగంగానే శుక్రవారం పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న నిహారిక తల్లిదండ్రులు రమాదేవి రాజా కుళ్లాయప్ప ల వివాహ దినోత్సవ సందర్భంగా అల్పాహారానికి 5000 రూపాయలు నగదును అందజేశారు. అనంతరం వారి చేతుల మీదుగా విద్యార్థినీలకు అల్పాహారాన్ని పంపిణీ చేశారు. అనంతరం పాఠశాల హెచ్ఎం తో పాటు టీచర్ రామకృష్ణ నాయక్, ఉపాధ్యాయ బృందం, విద్యా కమిటీ వైస్ చైర్మన్ బాబ్జాన్, పదవ తరగతి విద్యార్థి నీలు దాతలకు కృతజ్ఞతలు తెలుపుతూ వివాహ దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img