Tuesday, December 6, 2022
Tuesday, December 6, 2022

తాగునీటి సమస్య పరిష్కారానికి నిధులు కేటాయించండి

రాకెట్ల సర్పంచ్‌ శివమ్మ
విశాలాంధ్ర – ఉరవకొండ : ఉరవకొండ మండలం రాకెట్ల గ్రామ పంచాయతీలో తాగునీటి సమస్య పరిష్కారానికి 10 లక్షల రూపాయల నిధులు కేటాయించాలని అనంతపురం ఎంపీ తలారి రంగయ్య ను జడ్పీ చైర్మన్‌ బోయ గిరిజమ్మను రాకెట్ల గ్రామ సర్పంచ్‌ శివమ్మ మరియు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సుశీలమ్మ, వైసిపి పార్టీ నాయకులు మంగళవారం అనంతపురంలో కలిసి విజ్ఞప్తి చేశారు. ఉరవకొండ నుంచి కళ్యాణదుర్గానికి చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులలో పిఏ బిఆర్‌ డ్యాము నుంచి సరఫరా అవుతున్న తాగునీటి పైపులు 11వందల మీటర్లు మేర దెబ్బతిన్నాయని దీనివల్ల గ్రామానికి తాగునీటి సరఫరా లో అంతరాయం ఏర్పడుతోందని అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న ఓహెచ్‌ఎస్‌ఆర్‌ ట్యాంకు కూడా శిథిలావస్థకు చేరుకున్నదని పైప్‌ లైన్‌ మరియు ట్యాంక్‌ నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరినట్లు తెలిపారు. ఎంపీ మరియు చైర్మన్‌ కూడా సానుకూలంగా స్పందించారని సర్పంచ్‌ శివమ్మ, వైసిపి సీనియర్‌ నాయకులు అశోక్‌ కుమార్‌, నాగరాజు మాజీ ఎంపీటీసీ సభ్యులు శ్రీనివాసులు విలేకరులకు తెలిపారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img