Sunday, September 24, 2023
Sunday, September 24, 2023

తాగు నీటి సమస్య పరిష్కరించాలని టిడిపి ఆందోళన

విశాలాంధ్ర- ఉరవకొండ : ఉరవకొండ పట్టణంలో నెలకొన్న తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉరవకొండ పట్టణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పది రోజులకు ఒకసారి తాగునీరు సరఫరా అవుతుందని దీనివల్ల పట్టణ ప్రజలు నీటి సమస్యతో ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. నిధులు, నీళ్లు పుష్కలంగా ఉన్న తాగునీటి సరఫరా చేసి ప్రజలకు అందించడంలో అధికారులు పూర్తిగా విఫలం చెందారని వారు పేర్కొన్నారు తాగునీటి కోసం ప్రజలు పడుతున్న కష్టాలను అధికారులు గుర్తించాలని సమస్యను తక్షణమే పరిష్కరించాలని వారు పేర్కొన్నారు. అనంతరం వారు స్థానిక ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో నీటి సమస్యపై చర్చించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img