Saturday, June 10, 2023
Saturday, June 10, 2023

తొగట వీర క్షత్రియ విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు..

తొగట వీర క్షత్రియ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం. వీరాంజనేయ ప్రసాద్
విశాలాంధ్ర- ధర్మవరం : ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదివి ఇటీవల పరీక్ష ఫలితాలలో మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహక నగదు బహుమతులను ఇవ్వడం జరుగుతుందని తొగట వీర క్షత్రియ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మొడెం వీరాంజనేయ ప్రసాద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు శనివారం మాట్లాడుతూ 2023-24 సంవత్సరపు పదవ తరగతి పరీక్షా ఫలితాలలో రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించి 541 మార్కులకు పైగా టాపర్గా నిలిచిన తొగట వీర క్షత్రియ విద్యార్థులకు ఇది ఒక మంచి అవకాశం అని వారు తెలిపారు. మా తోకటి వీర విద్యార్థులను ప్రోత్సహించాల్సిన బాధ్యత మాపై ఉండడంతో తాము ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. మొదటి ప్రోత్సాహక బహుమతిగా లక్ష రూపాయలు, రెండవ బహుమతిగా 50వేల రూపాయలు, మూడవ బహుమతిగా 25 వేల రూపాయలు, నాల్గవ బహుమతిగా పదివేల రూపాయలు అందజేయనున్నట్లు వారు తెలిపారు. ప్రోత్సాహక నగదు బహుమతి తో పాటు జ్ఞాపికలను కూడా అందజేస్తూ ఘనంగా సన్మాన కార్యక్రమం కూడా ఉంటుందని తెలిపారు. జిల్లాల వారీగా పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో 541 మార్కులు పైగా సాధించిన విద్యార్థుల యొక్క వివరాలను ఈ నెల 27వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తు తో పాటు మార్కుల జాబితా కుల ధ్రువీకరణ పత్రము చిరునామాతో కూడిన వివరాల వివరాలను ఆయా జిల్లాల తొగట వీర క్షత్రియ సంక్షేమ సంఘం అధ్యక్షులకు పంపాలన్నారు. ఈ ప్రోత్సాహక బహుమతులను ఒక స్ఫూర్తిగా తీసుకొని అత్యుత్తమ విజయాలను సాధించి సమాజానికి తొగట వీర క్షత్రియ కులానికి మంచి పేరు ప్రఖ్యాతలను తీసుకొని రావాలని వారు తెలిపారు. కావున ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు గమనించి తమ పిల్లలు పేర్లు నమోదు చేసుకునేలా కృషి చేయాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img