Friday, June 9, 2023
Friday, June 9, 2023

త్రాగు నీళ్ల కోసం రోడ్డు ఎక్కిన గ్రామస్తులు

విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ నగర పంచాయతీ తిమ్మాపురం, ఇస్లాపురం, వెంకటరెడ్డి పల్లి గ్రామాలకు త్రాగునీళ్లు రాకపోవడంతో బుధవారం ఇస్లాపురం క్లాస్ వద్ద మూడు గ్రామాల ప్రజల ఆధ్వర్యంలో ఒక గంటపాటు ఖాళీ బిందెలు తీసుకొని మహిళలు, ప్రజలు రాస్తారోకో నిర్వహించడం జరిగింది. మూడు గ్రామాలలో నీళ్లు అరకోరగా వస్తున్నాయి ప్రతిరోజు నీళ్ల కోసం ఇబ్బందులు పడుతున్నారని అనేకసార్లు అధికారులు దృష్టికి తీసుకుపోయిన ఫలితం లేకపోవడంతో రాస్తారోకో నిర్వహించారు. ఈ ఆందోళన కార్యక్రమం తెలుసుకున్న ఎస్సై రమేష్ బాబు ఆందోళన కార్యక్రమం విరమించాలని ప్రజలకు చెప్పడంతో మాకు నీళ్లు సమస్య పరిష్కారం చేసేంతవరకు ఆందోళన కొనసాగిస్తామని ఎస్ఐకి ప్రజలు తెలపడంతో అక్కడకు నగర పంచాయతీ కమిషనర్ వంశీ కృష్ణ భార్గవ్ వచ్చి గురువారం లోగా నీటి సమస్య పరిష్కారం చేస్తానని హామీ ఇవ్వడంతో రాస్తరోకో విరమింప చేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో రమేష్, రియాజ్ భాషా 1,3 వార్డు కౌన్సిలర్ లు గీతా హనుమంతు, గిరి, మహబూబ్ బాషా, వజ్రం నాగప్ప, హమాలీ భాష, హనుమంతు, సత్యం ,శ్రీరాములు, హరి, నాగరాజు, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img