Thursday, March 23, 2023
Thursday, March 23, 2023

దళితులపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

విశాలాంధ్ర -ఉరవకొండ : ఉరవకొండ నియోజకవర్గం వజ్రకరూరు మండలం కొనకొండ్ల గ్రామంలో దళితులపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని వివిధ దళిత సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దాడుల్లో గాయపడి ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దళితులను శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా దళిత,గిరిజన, హక్కుల సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు గోపాల్ మరియు ఎస్సీ ఎస్టీ సంఘాల జేఏసీ అధ్యక్షుడు సాకేహరి పామిడి బి ఎస్ పి లీడర్ మల్లికార్జున ఎంఆర్పిఎస్ పామిడి అధ్యక్షుడు సాకే ఓబులేసు ఎస్సీ ఎస్టీ ఐక్యవేదిక అనంతపురం జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ ఎస్సీ ఎస్టీ ప్రజా సమైక్య జిల్లా అధ్యక్షుడు బి రమేష్ వి సి కె ఉరవకొండ నియోజకవర్గం అధ్యక్షుడు గోపాల్ మరియు దళిత నాయకులు విడపనకల్లు మండలం కార్యదర్శి చెన్నకేశవులు, రామంజి. రామాంజనేయులు,యశ్వంత్ తదితర నాయకులు మాట్లాడుతూ గ్రామంలో దళితులపై తరచూ దాడులు చేస్తున్నారని దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను తక్షణమే నమోదు చేయాలన్నారు దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో ప్రభుత్వంతో పాటు పోలీసులు కూడా పూర్తిగా విఫలం చెందుతున్నారని వారు పేర్కొన్నారు, దళితులపై దాడులు చేసిన వారిని అరెస్టు చేసేంతవరకు కూడా దళిత సంఘాలు ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తాయన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img