విశాలాంధ్ర- ధర్మవరం : పట్టణంలోని ఎర్రగుంటలో భవిత కేంద్రం లో దివ్యాంగ విద్యార్థులకు ఉపకరణముల ఎంపిక కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించడం జరిగిందని ఎంఈఓ సుధాకర్ నాయక్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యులు డాక్టర్ నివేదిత, డాక్టర్ పద్మజ, డాక్టర్ కిరణ్, డాక్టర్ భాస్కర్ నాయక్, దివ్యాంగుల విద్యార్థులకు శరీర విభాగాలకు సంబంధించి పరీక్షలను నిర్వహించ డం జరిగిందన్నారు. ఈ దివ్యాంగ విద్యార్థుల ఉపకరణముల ఎంపిక కార్యక్రమానికి బత్తలపల్లి ధర్మవరం, రామగిరి ,చెన్నై కొత్తపల్లి, కనగానపల్లి, తాడిమర్రి మండలంలోని 44 మంది విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది అని తెలిపారు. తదుపరి ఈ విద్యార్థులకు ఉపకారణముల నిమిత్తం ఉన్నతాధికారులకు సిఫార్సు చేయడం జరిగిందన్నారు. ఇందులో ఉపకరణాలు హీరింగ్ 18, వీల్ చైర్స్ 14, సిపి చైర్ 4, రోల్ టెన్స్ 7, సెర్చ్ ఫుడ్ షో 1 విరసి 44 ఉపకరణములు కావలసి ఉన్నదని తెలిపారు. త్వరలోనే ఈ ఉపకరణాలను పంపిణీ చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం నాగప్ప, భవిత కేంద్రం ఉపాధ్యాయులు పాల్గొన్నారు.