విశాలాంధ్ర -ధర్మవరం : రాష్ట్ర దూదేకుల ముస్లిం మైనారిటీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఓ. రసూల్ సాహెబ్ శనివారం రోజున పులివెందులలో జరిగిన దూదేకుల సంక్షేమ సంఘం అద్వర్యం జరిగిన కార్యక్రమం లో సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణం 28 వ వార్డుకు చెందిన సరితాల భాష దుదేకుల, ముస్లిం మైనార్టీ (నూర్ భాష )సంక్షేమ సంఘం శ్రీ సత్య సాయి జిల్లా అధ్యక్షుణిగా ఎంపిక చేయడం జరిగిందని శనివారం రోజున సరితాల భాష తెలిపారు.ఈ సందర్బంగా సరితాల భాష గారు మాట్లాడుతూ… నన్ను జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకున్న నా దూదేకుల, ముస్లిం మైనార్టీ, సంక్షేమ సంఘం కుటుంబ సభ్యులకు, రాష్ట్ర( నూర్ భాష ) దూదేకుల ముస్లిం మైనార్టీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రసూల్ సాహెబ్ బాలముని నా హృదయ పూర్వక కృతఙ్ఞతలు. త్వరలోనే శ్రీ సత్య సాయి జిల్లా మొత్తం పార్యటించి నియోజకవర్గ కమిటీలు, మండల కమిటీలు ఏర్పాటు చేసి దూదేకుల అభ్యున్నత కోసం కృషి చేస్తానని తెలిపారు.