Wednesday, June 7, 2023
Wednesday, June 7, 2023

దేశంలో బిజెపి పార్టీ మునిగి పోయే పడవ…

టిడిపి,జనసేన పార్టీలు బిజెపి ని కలుపుకుంటే వేంటిలెటర్ పైన ఉన్న జగన్ కు ఆక్సిజన్ ఇచ్చినట్టే..

టిడిపి,జనసేన పార్టీలు సెక్యులర్ పార్టీలతో జత కట్టండి…

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జగదీష్

విశాలాంధ్ర-గుంతకల్లు : దేశంలో బిజెపి పార్టీ మునిగి పోయే పడవని అలాంటి పార్టీతో జట్టు కట్టాలని టిడిపి,జనసేన పార్టీలు బిజెపి ని కలుపుకుంటే వేంటిలెటర్ పైన ఉన్న జగన్ కు ఆక్సిజన్ ఇచ్చినట్టే అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జగదీష్ పేర్కొన్నారు. శనివారం స్థానిక సిపిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డి.జగదీష్ మాట్లాడుతూ…పవన్ కళ్యాణ్ నిన్నటి దినం బిజెపి,టిడిపి, జనసేన కలిసి పోటీ చేస్తామని ప్రకటించారు.అయితే టిడిపి, జనసేన పార్టీలు బిజెపిని కలుపుకుంటే వెంటిలెటర్ పైన ఉన్న జగన్ కు ఆక్సిజన్ ఇచ్చినట్టే అని అన్నారు. ఎందువల్ల అంటే ఇప్పటికీ ఏపీలో బిజెపి పైన ఐదు కోట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని అన్నారు. విభజన హామీలు అమలు జరపలేదని ,ప్రత్యేక హోదా ఇవ్వలేదు,రైల్వే జోన్ ఇవ్వలేదు, ఏపికి ప్యాకేజీ కూడా ఇవ్వలేదన్నారు. ఈ విధంగా రాష్ట్రానికి మోసం చేసినందు వల్ల ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని మండిపడ్దారు. హామీలన్నీ నెరవేరుస్తానని నమ్మబలికిన బిజెపి ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని తెలిపారు. అందుకని బిజెపి నీ కలుపుకుంటే వారి పైన ఉన్న వ్యతిరేకత టిడిపి జనసేన కే చుట్టుకుంటుందన్నారు. కావున టిడిపి,జనసేన పార్టీ లు సెక్యులర్ పార్టీలైన సిపిఐ, సిపిఎం ,కాంగ్రెస్ పార్టీలతో కలిసి వచ్చినట్లయితే మత రాజకీయాలకు అడ్డుకట్ట వేసినట్లు అవుతుందని అన్నారు.టిడిపి,జనసేన వాళ్లకున్న గ్రాఫ్ కూడా బిజెపితో కలిస్తే తగ్గుతుందని పలు సర్వేలు చెబుతున్నాయన్నారు. ఈ కూటమి వల్ల వైయస్సార్ పార్టీకి నష్టం లేకపోగా కొద్దో గొప్పో ఆక్సిజన్ ఇచ్చినట్లు అవుతుందన్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలే బిజెపి పైన ఉన్న వ్యతిరేకత కనబడుతుందన్నారు.11 రాష్ట్రాల్లో శాసనసభ్యులను కొనుగోలు చేసి చట్టాలను బిజెపి తుంగలో తొక్కిందన్నారు. ఎన్డీఏలో భాగస్వాములు గా ఉన్న పలు పార్టీలు కూడా బయటికి వచ్చేసారని బిజెపి మునిగి పోయే ఒక పడవని అటువంటి పార్టీతో జట్టు కట్టాలని ఆలోచన ఎలా వచ్చిందో తెలియదన్నారు.టిడిపి,జనసేన పార్టీలు బిజెపితో పొత్తు పెట్టుకోవడం మార్చుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బి.గోవిందు, సిపిఐ పట్టణ కార్యదర్శి గోపీనాథ్ ,సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి ఎస్ఎండి గౌస్ ,సిపిఐ మండల సహాయ కార్యదర్శి రామాంజనేయులు, మండల కార్యదర్శి ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img