Monday, March 20, 2023
Monday, March 20, 2023

దేశ అభివృద్ధి సైన్స్ పైనే ఆధారపడి ఉంది

జెవివి జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆదిశేషు
విశాలాంధ్ర- ధర్మవరం : మానవ అభివృద్ధి పరిణామ క్రమంలో సైన్స్ దే కీలక పాత్ర అని, దేశ అభవృద్ధి సైన్స్ పైనే ఆధారపడి వుంటుంది అని జెవివి జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆది శేషు అన్నారు.స్థానిక సూర్య స్కూల్ లో మంగళవారం ప్రధానోపాధ్యాయుడు నరేంద్ర అధ్యక్షతన ఏర్పాటు చేసిన జాతీయ సైన్స్ దినోత్సవంలో పాల్గొని ప్రసంగిస్తూ… నాటి రాతి యుగం నుండి నేటి రాకెట్ యుగం వరకు జరిగిన మానవాభివృద్ధి పరిణామ క్రమంలో సైన్స్ దే కీలక పాత్ర అన్నారు. మన దేశంలోనే పుట్టి మన దేశంలోనే చదువుకుని, మన దేశంలోనే ప్రయోగాలు చేసి, విజ్ఞాన శాస్త్రంలో నోబెల్ పురస్కారం పొందిన ఏకైక వ్యక్తి సి వి రామన్ అన్నారు.నా మతం సైన్స్ దానినే జావితాంతం ఆరాధిస్తా అని ప్రకటించిన గొప్ప వ్యక్తి అన్నారు.
సైన్స్ మానవ వికాసానికి ఉపయోగపడాలి గానీ మానవ వినాశనానికి కాదు అని ఐన్ స్టైన్ చెప్పిన మాటలను నేడు గుర్తించాల్సిన అవసరం ఎంతైనా వుందన్నారు.. సైన్సును మానవ వినాశనానికి ఉపయోగిస్తే ప్రపంచం మొత్తం నాశనం అయ్యే ప్రమాదం వుందన్నారు.ఁగ్లోబల్ సైన్స్ ఫర్ గ్లోబల్ వెల్బీఇంగ్ఁ అనే థీమ్ ను ఈ సంవత్సరం ప్రకటించిందన్నారు .పాలకులే సైన్సు పేరుతో సూడో సైన్స్ ను ప్రచారం చేయడం బాధాకరమన్నారు.భారత రాజ్యాంగంలోని 51ఎ (హెచ్) ఆర్టికల్ ప్రకారం ప్రతి పౌరుడు శాస్త్రీయ ఆలోచనలు కల్గి వుండాలన్నారు. మానవత్వాన్ని పెంపొందించదానికి అందుకు పాలకులు కూడా కృషిచేయాలన్నారు.మన రాజ్యాంగం మతాన్ని వ్యక్తిగత అంశంగా పరిగణించిందనీ ,స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర్నించి ఇప్పటి వరకు పరిశీలిస్తే వ్యక్తిగత అంశంగా ఉన్న మతం రాజకీయ అంశంగా మారింది అని తెలిపారు.ఫలితంగా ప్రజలలో వైజ్ఞానిక ఆలోచనలు పెరగడానికి బదులు మూఢ విశ్వాసాలు పెరుగుతున్నా యనీ, దేశవ్యాప్తంగా జరుగుతున్న పలు సంఘటనలు ఈ విషయాన్ని లపరుస్తున్నాయన్నారు.అనంతరం జె వి విశాస్త్ర ప్రచార కన్వీనర్ ప్రసాద్ చేసిన మేజిక్ ప్రదర్శన, తదుపరి విద్యార్థులు ప్రదర్శించిన వి కూడా ఎంతగానో ఆకట్టుకుంది.ఈ కార్యక్రమంలో సైన్స్ ప్రధానోపాధ్యాయుడు నరేంద్ర , డైరెక్టర్ రఘు , లోకేష్, ఉపాధ్యాయులు మారుతి, వైష్ణవి, ప్రభావతి, కళావతి, శీనా విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img