Sunday, May 28, 2023
Sunday, May 28, 2023

నిత్య అన్నదానికి నా వంతు సహకారం అందిస్తా.. భరత్

విశాలాంధ్ర-గుంతకల్లు : కసాపురం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి నిత్యాన్నదాన సేవకు భరత్ (ఉపకార్ నావల్టీస్) ముఖ్యఅతిథిగా హాజరై అన్న ప్రసాద వితరణ చేశారు.అనంతరం భారత్ మాట్లాడుతూ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయ నిర్మాణం మరియు నిత్యాన్నదానం చేయటం చాలా సంతోషించదగ్గ విషయం అని ఇంతటి మహత్తరమైన కార్యక్రమానికి తలారి పరుశురాముడు ముందుండి నడపడం వారి పూర్వజన్మ సుకృతం ఈరోజు నా చేతుల మీదుగా అన్నప్రసాద వితరణ చేయడం ఎంతో ఆనందాన్నిస్తుందన్నారు.రోజు వందల మంది ఆకలి తీరుస్తున్న పరశురాముడు ఎంతో మందికి ఆదర్శప్రాయంగా నిలుస్తారని అన్నారు. మన ముందు ఆలయానికి నిత్య అన్నదానికి నా వంతు సహకారం అందిస్తామన్నారు.అనంతరం పరశురాముడు మాట్లాడుతూ నిత్య అన్నదాన సేవా ఆశ్రమమునకు విచ్చేసి తన వంతు నగదు సహకార అందిస్తున్నందుకు ఆయనకు శాలువాతో సన్మానించి స్వామి అమ్మ వారి పటాన్ని అందివ్వడం జరిగిందన్నారు. స్వచ్ఛందంగా ఇలాంటి విరాళాల ఇవ్వడం వారు మంచి మనసుకు నిదర్శనం అన్నారు.ఉగాది పురస్కరించుకొని ప్రత్యేక పూజలు తోపాటు స్వామి అమ్మవారు భక్తులకు ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనాలు ఏర్పాటు చేయడం
స్వామి అమ్మవారు ఆంజనేయ స్వామి భక్తులందరూ అన్న ప్రసాదం స్వీకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో తలారి శకుంతల, మల్లికార్జున స్వామి, సత్య స్వామి, ప్రధాన సేవకులు స్వామి అమ్మవారి భక్తాదులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img