Wednesday, March 29, 2023
Wednesday, March 29, 2023

నియోజకవర్గ ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా విడుదల… ఆర్డీవో తిప్పినాయక్

విశాలాంధ్ర- ధర్మవరం : ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇటీవలే ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మూడు గ్రాడ్యుయేట్ రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు కడప, అనంతపురం, కర్నూల్ జిల్లాలు కాగా పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీలకు కడప, అనంతపురం, కర్నూలు ఉన్నాయి. ఈ సందర్భంగా ఆర్డీవో తిప్పే నాయక్ నియోజకవర్గంలోని గ్రాజియేటివ్, టీచర్ల యొక్క ఓటర్ల జాబితాను తెలియజేశారు. నియోజకవర్గంలోని ధర్మవరం అర్బన్, రూరల్, బత్తలపల్లి, ముదిగుబ్బ, తాడిమర్రి మండలాలలో గ్రాడ్యుయేషన్ ఓట్లు పురుషులు, స్త్రీలు కలసి 9,506 కాగా టీచర్ల పురుషులు, స్త్రీలు ఓటర్లు 612 కలవని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈనెల 16న నోటిఫికేషన్, మార్చి 13న పోలింగ్, మార్చి 16న కౌంటింగ్ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప ఎన్నికల తాసిల్దార్ అనిల్ కుమార్ కలరు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img