Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

నియోజకవర్గ ఓటర్ల జాబితా విడుదల.. ఆర్డిఓ తిప్పే నాయక్

విశాలాంధ్ర-ధర్మవరం : నియోజకవర్గంలోని ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ మండలాల ఓటర్ల జాబితాను గురువారం సాయంత్రం ఆర్డిఓ తిప్పే నాయక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలోని నాలుగు మండలాలలో 5-1-2022 నాటికి మొత్తం ఓటర్లు 2,41,649 మంది ఉండగా అందులో పురుషులు 1,20,065, స్త్రీలు 1,21,564, ఇతరులు 20 కలరని తెలిపారు. అదేవిధంగా 5-01-2023 నాటికి ఓటర్లు మొత్తం 2,34,172 మంది కాగా ఇందులో పురుషులు 1,16,541, స్త్రీలు 1,17,612, ఇతరులు 19 కలరని తెలిపారు. తదుపరి ఫారం-6 లో 3,727 కు గాను 3,199 ఆమోదం తెలపగా, 518 తిరస్కరించడం జరిగిందన్నారు. ఫారం-7 లో12,644 కు గాను 11,003 తొలగించుట, 1,641 తిరస్కరించడం జరిగిందన్నారు. మొత్తం మీద గత సంవత్సరంతో పోల్చుకుంటే మూడు శాతం తగ్గిందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img