Wednesday, June 7, 2023
Wednesday, June 7, 2023

నిరసన దీక్షకు స్వర్ణకారులు సంఘీభావం

విశాలాంధ్ర-తాడిపత్రి: పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో గత రెండు రోజులుగా మున్సిపల్ కమిషనర్ వైఖరికి నిరసనగా మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి, టీడీపీ కౌన్సిలర్లు చేస్తున్న నిరసన దీక్షకు స్వర్ణ కారుల సంఘం అధ్యక్షులు జాకీర్ హుస్సేన్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిపాలనను, ఆస్తులను, మున్సిపాలిటీ అభివృద్ధి పనులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాల్సిన కమిషనర్ ఇలా బాధ్యతాయుతంగా వ్యవహరించడం చాలా దుర్మార్గమైన చర్య అన్నారు. ఈ కార్యక్రమంలో స్వర్ణకారులు షబ్బీర్, సలీం, భషీర్, తాజూ, జాఫర్ మోడీన్, జాఫర్ వలి, భాషా మోడీన్, రవి ఆచారీ, ఖాజా, ఆనంద్ ఆచారీ, ఇంతియాజ్, ఆరీఫ్, మహమ్మద్ గౌస్, సంధానీ, ఆనంద్ ఆచారీ, మనియార్ కరీం, శ్రీనివాసులు, నజీర్, నూర్, రసూల్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img