విశాలాంధ్ర- ఉరవకొండ: అనంతపురం జిల్లా నూతన ఎస్పీగా పదవి బాధ్యతలు స్వీకరించిన శ్రీ కే శ్రీనివాస్ రావు ని జై కిసాన్ ఫౌండేషన్ అధ్యక్షులు నాగమల్లి ఓబులేష్, ఎస్కే చారిటబుల్ ట్రస్ట్ లెనిన్ గురువారం ఎస్పీ కార్యాలయంలో శాలువా కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ. అనంతపురం జిల్లా రైతుల యొక్క కష్టాలు,రైతులు చేస్తున్న త్యాగాలు ,వ్యవసాయ విధానాలు, అలాగే రైతులు ఆత్మహత్యలు వాటి నివారణ మార్గాలు మరియు పర్యావరణం గురించి, అలాగే రాయదుర్గం నియోజకవర్గంలో ఎడారి అవుతున్నటువంటి పలు గ్రామాల స్థితిగతుల గురించి సవివరంగా నూతన ఎస్పీ దృష్టికి తీసుకురావడం జరిగిందని వారు తెలిపారు.అందుకు నూతన ఎస్పీ కూడా స్పందిస్తూ జై కిసాన్ ఫౌండేషన్ రైతుల కోసం చేసే కార్యక్రమాల్లో అవకాశం ఉన్నప్పుడల్లా పాల్గొంటానని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. రైతుల, వ్యవసాయం పట్ల ప్రకృతి పట్ల అపారమైనటువంటి ప్రేమ అభిమానాలు చూపించినటువంటి నూతన ఎస్పీ శ్రీ శ్రీనివాస్ రావు కి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసినట్లు వారు పేర్కొన్నారు