విశాలాంధ్ర / ఉరవకొండ: ఉరవకొండ నియోజకవర్గం వజ్రకరూరు మండలం చాబాల గ్రామంలో నూతన, పెంచిన పెన్షన్లను మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి చేతుల మీదుగా సోమవారం లబ్ధిదారులకు అందజేశారు.అంతకుముందు నాయకులు ,లబ్ధిదారులతో కలిసి నూతన సంవత్సర కేక్ కట్ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.ఈ కార్యక్రమంలో ఉరవకొండ మార్కెట్ కమిటీ చైర్మన్ సుశీలమ్మ, గ్రామ సర్పంచ్ జగదీష్, మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు సోమశేఖర్ రెడ్డి, ఆ పార్టీ నాయకులు నారాయణప్ప, సుల్తాన్ మరియు అధికారులు, వైఎస్ఆర్సిపి నాయకులు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.