విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఈనెల 21వ తేదీ నుండి 24వ తేదీ వరకు నాలుగు రోజులు పాటు రాష్ట్రస్థాయి హాకీ పోటీలను నిర్వహిస్తున్నట్లు శ్రీ సత్య సాయి జిల్లా హాకీ కార్యదర్శి సూర్య ప్రకాష్ అధ్యక్షులు బివి. శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ హాకీ పోటీలు హాకీ శ్రీ సత్య సాయి జిల్లా వారు నిర్వహిస్తున్నారని తెలిపారు. లేట్ బి ఎస్ రాయుడు మెమోరియల్ 13వ హాకీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇంటర్ డిస్టిక్ సీనియర్ మెన్ హాకీ ఛాంపియన్షిప్..2023 గా నిర్వహిస్తున్నామన్నారు. ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, ఆర్ డి టి ప్రోగ్రాం డైరెక్టర్ మాంచు ఫెర్రర్, స్టేట్ హాకీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు చాణుక్యరాజు కార్యదర్శి హర్షవర్ధన్, ఆర్డీవో తిప్పే నాయక్, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, మున్సిపల్ చైర్మన్ లింగం నిర్మల తదితరులు పాల్గొంటారని తెలిపారు. ఈ పోటీల్లో సత్యసాయి జిల్లాతో పాటు అనంతపురం, కడప, కర్నూల్ తిరుపతి నెల్లూరు గుంటూరు, ఎన్టీఆర్ జిల్లా, కాకినాడ ,ఏలూరు, విశాఖపట్నం, అనకాపల్లి, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లా జట్లు పాల్గొంటారని తెలిపారు. ఈ టోర్నీలో పాల్గొని జిల్లా జట్లకు వసతి భోజన సౌకర్యాలను శిరిడి సాయిబాబా గుడిలో కల్పించుకున్నామని వారు తెలిపారు. కావున ఈ టోర్నమెంట్ విజయవంతం చేయాలని తెలిపారు.