Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

నేడే అన్నా క్యాంటీన్ ప్రారంభం

విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ నగర పంచాయతీ నందు ఆదివారం ఉదయం 11:30 గంటలకు అంబేద్కర్ సర్కిల్ నందు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి సవిత ఆధ్వర్యంలో తన సొంత నిధులతో తెలుగుదేశం పార్టీ గతంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ మాదిరిగా సొంత ఖర్చులతో ప్రతిరోజు ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు ఐదు రూపాయలకే మంచి రుచికరమైన భోజనాన్ని అందించాలని సంకల్పంతో తెలుగుదేశం పార్టీ యొక్క ఆశయాలను కొనసాగించాలని ఉద్దేశంతో సొంత నిధులు వెచ్చించి బడుగు బలహీన వర్గాల పేద ప్రజల కోసం కార్మికుల కర్షకుల కోసం ఐదు రూపాయలకే నాణ్యమైన భోజనం అందించబడునని ఈ అన్న క్యాంటీన్ ప్రారంభం వలన చాలామందికి పేదలకు మేలు జరుగుతుందని ఉద్దేశ్యంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగానే తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్న క్యాంటీన్లను అధికారం చేపట్టిన తర్వాత మూసి వేయడం జరిగిందని వాటిని తిరిగి ప్రారంభించాలని ఉద్దేశంతో ప్రభుత్వము లేకున్నా ఈ కార్యక్రమాన్ని కొనసాగించుకున్నామని సవిత తెలిపారు ఈ క్యాంటీన్ ప్రారంభోత్సవానికి నియోజకవర్గ స్థాయి నాయకులు జిల్లా స్థాయి నాయకులు పాల్గొంటారని నియోజకవర్గంలోని ఐదు మండలాల కార్యకర్తలు పాల్గొన్నారు ఆమె తెలిపారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img