Tuesday, March 28, 2023
Tuesday, March 28, 2023

నేత్రదానం చేసిన మాజీ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు వెంకటరమణ గుప్తా

విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని మాజీ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొప్పరం వెంకటరమణ గుప్తా గురువారం మృతి చెందారు. వీరి కుమారులు గౌరీ శంకర్, పార్థసారథి, కుమార్తె దివ్యశ్రీ లు యువర్స్ ఫౌండేషన్ వారికి నేత్రదానం కొరకు అంగీకరించి సమాచారాన్ని అందించారు. తదుపరి అక్కడ చేరుకున్న యువ ఫౌండేషన్ అధ్యక్షులు వై కే శ్రీనివాసులు, పోలా ప్రభాకర్ చాంద్బాషాలు ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్ టెక్నీషియన్ ప్రదీప్ తో నేత్ర సేకరణ చేశారు. అనంతరం యువర్ ఫౌండేషన్ వారు మాట్లాడుతూ ఈరోజు రెండు కళ్ళు దానం మరో ఇరువురికి కంటి వెలుగును చూపిస్తాయని తెలిపారు. తదుపరి యువర్ ఫౌండేషన్ వారు నేత్ర దాత కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలను తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img