Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

నేత్రదానం చేసిన యువకుడు

విశాలాంధ్ర- ధర్మవరం: పట్టణంలోని తేరు బజారులో గల నిచ్చెన మెట్ల ప్రదీప్ కుమార్ (37) గుండెపోటుతో శనివారం ఉదయం మృతి చెందారు. మృతుని అన్న ప్రవీణ్ కుమార్ యువర్ ఫౌండేషన్ వారికి నేత్రదానం కొరకు సమాచారాన్ని అందించారు. దీంతో యువర్ ఫౌండేషన్ అధ్యక్షులు వైకే. శ్రీనివాసులు, కార్యదర్శి సుకుమార్ తో పాటు జిల్లా అంధత్వ నివారణ సంస్థ టెక్ని షియన్ శ్రీకాంత్ సంఘటనా స్థలానికి చేరుకొని నేత్ర సేకరణ చేశారు. అనంతరం అధ్యక్షులు వై కే శ్రీనివాసులు, ఫౌండేషన్ ప్రతినిధులు ఆ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. మీరిచ్చిన రెండు కళ్ళు మరో ఇరువురికి కంటి వెలుగును ప్రసాదించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సభ్యులు రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img