Wednesday, March 29, 2023
Wednesday, March 29, 2023

నేరాల కట్టడి కోసమే కార్డన్‌ సెర్చ్‌ : సీఐ మోహన్

విశాలాంధ్ర-రాప్తాడు : గ్రామాల్లో నేరాల కట్టడి కోసం కార్డన్ సెర్చ్ నిర్వహించామని ఇటుకలపల్లి సర్కిల్ సీఐ మోహన్ తెలిపారు. రాప్తాడు మండల పరిధిలోని ప్రసన్నాయపల్లి గ్రామంలో గురువారం ఉదయం రాప్తాడు ఎస్ఐ ఆంజనేయులు, సిబ్బందితోపాటు నాకాబందీ నిర్వహించారు. రౌడీ షీటర్స్, ట్రబుల్ మాంగర్స్ ఇళ్లలో తనిఖీలు చేసిన అనంతరం గ్రామంలో ఫుట్ పెట్రోలింగ్, చిన్మయ్ నగర్ లో గ్రామసభ పెట్టి హెల్మెట్ ధారణపై, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. సీఐ మోహన్ మాట్లాడుతూ ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. చట్టవిరుద్ధ కార్యకలపాలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ, దొంగతనాల నివారణ చర్యల్లో భాగంగా చెడునడత కలిగిన వ్యక్తులు, సంఘ వ్యతిరేక శక్తులు, అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు, సామాన్య ప్రజానీకాన్ని ఇబ్బందులకు గురి చేసే వారిపై కార్డన్‌ సెర్చ్‌ చేశారు. అసాంఘిక శక్తులు, నేరస్థులపై చట్టపరమైన చర్యలు తీసుకొని, సామాన్య ప్రజానీకానికి భద్రతా భావాన్ని పెంపొందించే కార్యక్రమాలు ప్రజలకు తెలియజేస్తూ పోలీస్‌శాఖ నిర్వహించే ఇటువంటి కార్యక్రమానికి తమవంతు సహకారాన్ని అందించాలని పోలీసులకు లేదా డయల్ 100కు సమాచారం ఇవ్వాలన్నారు. ఈ కార్డన్ సెర్చ్ లో చెడు నడత కలిగిన వ్యక్తులు, రౌడీషీటర్లు, సస్పెక్ట్‌ షీటర్లు, పాత నేరస్తులు గురించి సమాచారం సేకరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img