Monday, March 20, 2023
Monday, March 20, 2023

నేరుగా ప్రజలకు చేరువవుతున్న జగనన్న సంక్షేమ పథకాలు…

గుంతకల్లు ఎమ్మెల్యే వై.వెంకట్రాంరెడ్డి

విశాలాంధ్ర ..గుంతకల్లు..నేరుగా ప్రజల చెంతకు సంక్షేమ పథకాలు అందే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నాడని గుంతకల్లు ఎమ్మెల్యే వై వెంకట్రామిరెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని ఏడవ వార్డు వైయస్సార్సీపి కౌన్సిలర్ లింగన్న ఆధ్వర్యంలో గడపగడప కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథులు ఎమ్మెల్యే వై వెంకట్రామిరెడ్డి ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుని ప్రభుత్వ సంక్షేమ పథకాల విషయంపై చర్చించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా అందేందుకు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాడని తెలిపారు ప్రతి ఒక్కరు ఎటువంటి సమస్య అయినా తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ భవాని ,వైస్ చైర్ పర్సన్ నైరుతి రెడ్డి, మైమున్ బి, కమిషనర్ బండి శేషన్న, వైసీపీ పట్టణ అధ్యక్షుడు సుంకప్ప, జింకల రామాంజనేయులు ,మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎస్వీఆర్ మోహన్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ భీమ లింగప్ప, ఎద్దుల శంకర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img