Monday, March 20, 2023
Monday, March 20, 2023

పంచాయతీరాజ్ విభాగం జిల్లా అధ్యక్షుడిగా బసవరాజు

విశాలాంధ్ర-ఉరవకొండ : వైస్సార్ కాంగ్రెస్ పార్టీ పంచాయితీ రాజ్ విభాగం జిల్లా అధ్యక్షుడుగా ఉరవకొండ పట్టణానికి చెందిన మీనుగా బసవరాజు ను నియమించడంతో వైస్సార్సీపీ నాయకులు, అభిమానులు ఆయనకు అభినందనలు తెలియజేశారు. గురువారం ఉరవకొండలో ఆయనను సన్మానించారు. భవిష్యత్తులో ఆయన ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వారితో కలిసి ఆయన కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు నిరంజన్ గౌడ్, కో ఆప్షన్ సభ్యుడు పామిడి సలీం,వైస్సార్సీపీ నాయకులు ఆటో సీనా, అన్వర్,లెనిన్,రియాజ్, ఎమ్మెల్ఓ ఓబులేసు, షాహాబుద్దిన్, పంచాయతీ సర్వేయర్ సాగర్, మెకానిక్ ఫారూఖ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img