పోలీసులకు సిపిఐ నాయకులకు తోపులాటలా ఉద్రిక్తత…
సిపిఐ నేతలను అక్రమ అరెస్టులు చేసిన పోలీసులు…
విశాలాంధ్ర-గుంతకల్లు : పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట పోలీసులు సిపిఐ నాయకుల మధ్య తోపులాట ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో సాధారణ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు ఈ నేపథ్యంలో ముందస్తు సమాచారంతో డిఎస్పి నర్సింగప్ప పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. కౌన్సిల్ జరుగుతున్న సమావేశం సిపిఐ నాయకులు అడ్డుకోకుండా తలుపులను మూసేశారు అయితే పట్టణ మౌలిక వసతులు కల్పించాలంటూ నిరసనలు తెలుపుతున్న సిపిఐ నాయకులు పట్టణ మౌలిక సదుపాయాల వినతి పత్రాన్ని సమర్పించేందుకు మున్సిపల్ కార్యాలయంలోకి చొచ్చుకొని వెళ్లేందుకు ప్రయత్నించిన సిపిఐ నాయకులపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు అయితే ఒకరికొకరు 25 నిమిషాల పాటు పోలీసులు సిపిఐ నాయకుల తోపులాట నేపథంలో మున్సిపల్ కార్యాలయం అద్దాలు ధ్వంసం అయ్యాయి.. దీంతో మున్సిపల్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఉద్రిక్తత వాతావరణం ఏర్పడడంతో పోలీసులు సిపిఐ నాయకులను కార్యకర్తలను అరెస్ట్ చేసి టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈ సంఘటన స్థలానికి హుటాహుటిన డిఎస్పి నరసింగప్ప చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.