Wednesday, June 7, 2023
Wednesday, June 7, 2023

పదవ తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు బోల్తా

విశాలాంధ్ర-రాప్తాడు : ఏపీ విద్యాశాఖ విడుదల చేసిన పదవ తరగతి వార్షిక పరీక్షల ఫలితాల్లో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు బోల్తాపడ్డాయి. హంపాపురం జడ్పీహెచ్ఎస్ లో 50 మందికి 22 మంది, ఎం. బండమీదపల్లిలో 20 మందికి 9 మంది, గాండ్లపర్తిలో 14 మందికి 8 మంది, రాప్తాడు 70 మందికి 42 మంది, మరూరులో 31 మందికి 21 మంది, గొందిరెడ్డిపల్లిలో 20 మందికి 14 మంది, కేజీబీవీ రాప్తాడులో 36మందికి 10మంది, ఏపీ మోడల్ స్కూల్లో 77 మందికి 16 మంది ఫెయిలయ్యారు. కాగా హంపాపురానికి చెందిన ఈ హర్షవర్ధన్ 516, కె.మంజునాథ్ 485, గాండ్లపర్తి, ఎ.రాధిక 408, బి హిందు 394, రాప్తాడు జడ్పీహెచ్ఎస్ లో శ్రీకాంత్ రెడ్డి 478, ఎస్ కార్తీక్ 455, మరో ఊరు జడ్పీహెచ్ఎస్ లో బి.మమత 468, డి.యమున 433, గొందిరెడ్డిపల్లి రెడ్డి జడ్పీహెచ్ఎస్ లో కె.శిల్ప 478, బి.సంధ్య 336, కేజీబీవీ రాప్తాడులో బి.అక్షయ 546, హెచ్.తస్లీమా ఫర్హానా 510, ఏపీ మోడల్ స్కూల్లో జి.వినయ్ కుమార్ 574, బి.సంయుక్త 539, ఇక ప్రయివేటు స్కూళ్ళైన వినయ్ కుమార్ స్కూల్ లో శ్రావణి 413, సాయిచరణ్ 470, ఆర్డీటీ ఇంక్లూజివ్ పాఠశాలలో టీ పవన్ కుమార్ 544, కే.అరవింద్ కుమార్ 516, ఎల్ఆర్జీ హై స్కూల్లో కె గుల్నర్ కౌసర్ 584, లక్ష్మీప్రియ 574, సెయింట్ విన్సెంట్ డిపాల్ స్కూల్లో నేహా చౌదరి 587, మోక్షిత 579 మార్కులు సాధించి మొదటి రెండు స్థానాలు సాధించారు. మండలవ్యాప్తంగా ఉన్న 8 ప్రభుత్వ, 4 ప్రయివేటు పాఠశాలల్లో 623మంది పరీక్షలు రాయగా 438 మంది పాసై 70 శాతం ఉత్తీర్ణత సాధించారని ఎంఈఓ మల్లికార్జున తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img