Sunday, May 28, 2023
Sunday, May 28, 2023

పన్నులను సకాలంలో చెల్లించండి… మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున

విశాలాంధ్ర- ధర్మవరం : పట్టణంలోని ప్రజలందరూ కూడా మున్సిపల్ పనులను సకాలంలో చెల్లించి పురపాలక సంఘం అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున మంగళవారం పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం వారు 2023-24 సంవత్సరమునకు సంబంధించిన ఇంటి పన్నులు ఏక మొత్తంగా చెల్లించిన వారికి పన్ను మొత్తములో ఐదు శాతం మినహాయింపు ఉంటుందని తెలిపారు. ఈ మినహాయింపు పన్నును ఈనెల 30వ తేదీ లోపల చెల్లించాలని వారు తెలిపారు. పన్ను చెల్లింపు దశను ఆన్లైన్ ద్వారా గాని మున్సిపల్ కార్యాలయము నందు గాని లక్ష్మి చెన్నకేశవపురం సచివాలయం వద్ద గాని ఎల్పీ సర్కిల్లో గల సచివాలయంలో గాని చెల్లించవచ్చునని వారు తెలిపారు. పన్నులు చెల్లించిన వెంటనే రసీదు తప్పనిసరిగా పొందాలని తెలిపారు.ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఆఫీసర్, ఇన్చార్జి మేనేజర్ ఆనంద్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img