Friday, March 31, 2023
Friday, March 31, 2023

పరీక్ష సమయానికి అనుకూలంగా బస్సులు నడపాలి…

ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు.. విజయభాస్కర్
విశాలాంధ్ర -ధర్మవరం : ఈనెల 15వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరపు విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, దీన్ని దృష్టిలో ఉంచుకొని విద్యార్థులందరికీ పరీక్షా సమయానికి అనుకూలంగా బస్సులు నడపాలని కోరుతూ బుధవారం ఆర్టీసీ డిపో మేనేజర్ మోతిలాల్ నాయక్ కు బుధవారం ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు విజయభాస్కర్, నాయకులు చైతన్య, సుధీర్, నాగమోహన్, రాజేష్, కృష్ణ , తాహిర్ తదితరులు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం విజయభాస్కర్ మాట్లాడుతూ ప్రతి ఒక్క ఎక్స్ప్రెస్ బస్సు, ఆర్డినరీ బస్సులు అని తేడా లేకుండా ప్రతిష్టాపు వద్ద బస్సులు నిలపాలని తెలిపారు. ముఖ్యంగా రామగిరి కనగానపల్లి చెన్నై కొత్తపల్లి కొత్తచెరువు కృష్ణాపురం తాడిమర్రి నుంచి విద్యార్థులు పరీక్షలు రాయడానికి పరీక్షా సమయానికి రాలేక తీవ్ర ఇబ్బందులు పడుతూ ధర్మవరం కి వస్తున్నారన్న విషయాన్ని తమరు గమనించాలని, గుర్తించాలని వారు సూచించారు. సకాలంలో విద్యార్థులకు బస్సులు నడక పోతే ఉద్యమాలకు శ్రీకారం చుడతామని వారు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img