Thursday, March 23, 2023
Thursday, March 23, 2023

పాత్రికేయులకు క్షమాపణ చెప్పిన జీపి.మంతకల్‌ రెడ్డి…

విశాలాంధ్ర-గుంతకల్లు : ఈనెల 14 వ తేదీన ప్రముఖ భూస్వామి జిపి.హేమ కోటి రెడ్డి హత్యా ఘటనలో వార్త కవరేజ్‌ కు వెళ్ళిన పాత్రికేయుల ను దుర్బాషలాడిన మృతుడు జిపి.హేమ కోటిరెడ్డి తమ్ముడు జిపి.నీలకంఠరెడ్డి కుమారుడు జీపి.మంతకల్‌ రెడ్డి పై పాత్రికేయులు ఫిర్యాదు చేశారు.దీంతో సోమవారం రెండవ పట్టణ సీఐ గణేష్‌ స్టేషన్‌ కు పిలిపించగా ఆ సమయంలో విలేకరులను దురుసు గా మాట్లాడినది వాస్తవమని అన్నారు. ఐతే నేను వారిని విలేకరులుగా గుర్తించ లేకపోయానని ప్రైవేటు వ్యక్తులు కూడా మొబైల్‌ ఫోన్లు లో ఫోటోలు తీసి సోషల్‌ మీడియా పెడుతూ ఉన్నందున వారు అనుకుని పొరపాటున మాట్లాడినానని అందుకు క్షమించాలని పాత్రికేయులకు కోరారు. దీంతో పోలీసుల ఎదుట బహిరంగ క్షమాపణ కోరడంతో అతడిని క్షమించామని సీఐ పాత్రికేయులను సముదాయించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img