Thursday, March 23, 2023
Thursday, March 23, 2023

పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు

మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర రెడ్డి

విశాలాంధ్ర-ఉరవకొండ : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పార్టీలకి అతీతంగా అర్హులైన వారందరికీ కూడా అందించడం జరుగుతుందని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర రెడ్డి అన్నారు. బుధవారం ఉరవకొండ పట్టణంలోని 10 వ వార్డులో ఃగడప గడపకు మన ప్రభుత్వంః కార్యక్రమాన్ని నిర్వహించారు. గడప గడపకి వెళ్లి సీఎం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న పథకాలను మాజీ ఎమ్మెల్యే ప్రజలకు వివరించారు.ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు,సచివాలయ సిబ్బంది, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img