Friday, March 31, 2023
Friday, March 31, 2023

పాలిటెక్నిక్ కళాశాలలో స్కిల్ హబ్ ఏర్పాటు.. ప్రిన్సిపాల్ సురేష్ బాబు

విశాలాంధ్ర- ధర్మవరం : ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో స్కిల్ హబ్బును ఏర్పాటు చేస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ సురేష్ బాబు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి షేక్ అబ్దుల్ కయుం తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం వారు మాట్లాడుతూ ఫిబ్రవరి 15 నుండి డెమోస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్, గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ (అకౌంట్ ఎగ్జిక్యూటివ్) కోర్సులను ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఈ కోర్సులకు ఇంటర్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన యువతి, యువకులు నమోదు చేసుకోవలసినదిగా వారు తెలిపారు. శిక్షణ అనంతరం వీరికి ఉద్యోగ అవకాశము కూడా కల్పించడం జరుగుతుందని తెలిపారు నిరుద్యోగ యువతి, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసినదిగా వారు సూచించారు. మరిన్ని వివరాలకు కళాశాల యందు నేరుగా లేదా సెల్ నెంబర్ 9182288465 కు సంప్రదించాలన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img