Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

పాలిటెక్నిక్ కళాశాలలో స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు ప్రారంభం

విశాలాంధ్ర -ఉరవకొండ : ఉరవకొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య శిక్షణ కేంద్రం వారు 30 మంది విద్యార్థులకు జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ కోర్సులపై ప్రత్యేక శిక్షణ తరగతులను ప్రారంభించినట్లు కళాశాల ప్రిన్సిపల్ ఆశ్రఫ్ అలీ, కోఆర్డినేటర్ అనిల్, స్కిల్ డెవలప్మెంట్ కోఆర్డినేటర్ టి.జయలక్ష్మి, శిక్షకురాలు వి జయలక్ష్మి తెలిపారు. శనివారం వారు విలేకరులతో మాట్లాడుతూ విద్యార్థులకు బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ సాఫ్ట్ స్కిల్స్, సి భాషా ఎస్ క్యూ ఎల్, ఒరాకిల్, జావ తదితర వాటిపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు శిక్షణ పూర్తయిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తామని వారు తెలిపారు శిక్షణ తరగతులు తమకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో త్రిబుల్ ఈ శాఖధిపతి వై సురేష్ బాబు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img