Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

పింఛన్ డబ్బుతో పరారైన వెల్ఫేర్ అసిస్టెంట్

విశాలాంధ్ర -శెట్టూరు : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాపనగా చేపడుతున్న గ్రామ సచివాలయ వ్యవస్థ నీరుగారుస్తున్న దాదాపుగా 10 రోజుల నుంచి డ్యూటీ కి రాకుండా గ్రామ సచివాలయం అందుబాటు లేకుండా పింఛన్ లబ్ధిదారులు చుట్టూ తిప్పుకుంటూ లబ్ధిదారులు ఆవేదన చెందారు బసంపల్లి శెట్టూరు, గ్రామానికి చెందిన బోయ రామాంజనేయులు కు కిష్టప్ప, శ్రీధర్ శర్మ, దుర్గేష్ జనవరి నెల వైయస్సార్ పింఛన్లు ఇవ్వకుండా లబ్ధిదారులు చుట్టూ తిప్పుకుంటున్నాడు బాధితులు తెలియజేశారు అదేవిధంగా వైయస్సార్ బీమా పథకం కింద అనారోగ్యంతో మృతి చెందిన గాజుల కుమార్, గాజుల లోకేష్, చెందినవారికి తక్షణ సహాయం మంజూరైన డబ్బులు ఇవ్వలేదని బాధితులు ఫిర్యాదు చేశారు గత మూడు నెలల కిందట 50 మందికి సంబంధించిన వైయస్సార్ పింఛన్ పంపిణీలో అక్రమాలు చేయడంతో బాధితులు కలిసి జిల్లా స్థాయి అధికారికి పిడి, డిపిఓ, జడ్పీ జిల్లా చైర్పర్సన్ కు ఫిర్యాదు చేసిన వెల్ఫేర్ అసిస్టెంట్ లో మార్పు రాకపోవడంతో గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టి ప్రజలకు ఇబ్బంది కలకుండా ఉన్నందుకు గతంలో ఒక మాజీ సర్పంచ్ ముందుకు వచ్చి ఆ డబ్బులు పంపిణీ చేశారు అయిన కూడా ఆయనలో మార్పు రాకపోవడంతో వాళ్ళ డబ్బులు కూడా ఇవ్వకుండా మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి అందుబాటులోకి కూడా రాకుండా ఉన్నాడు సెలవు పెట్టకుండా ఇష్టానుసారంగా ఉద్యోగం చేస్తున్నాడు అయినా కూడా అధికారులు మాత్రం మాత్రం అతనిపైన చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరతుగా వ్యవహరిస్తున్నారు అని వారు బాధితులు మండల ఇంచార్జ్ ఎంపీడీవో ఫిర్యాదు చేశారు బాధితులు మాట్లాడుతూ జిల్లా స్థాయి అధికారులు మండల స్థాయి అధికారులు అండదండలు చూసి రెచ్చిపోతున్న వెల్ఫేర్ అసిస్టెంట్ పై పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వైసిపి మండల నాయకుడు శ్యాంసుందర్ చౌదరి, బాధితులు తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img