Sunday, April 2, 2023
Sunday, April 2, 2023

పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం

విశాలాంధ్ర-ఉరవకొండ : పిడిఎఫ్ తరపున పశ్చిమ రాయలసీమ పట్టభద్రులు ఎమ్మెల్సీ అభ్యర్థిలు గా పోతుల నాగరాజు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కత్తి నర్సింహారెడ్డి బరిలో ఉన్నారని మీ అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించాలని కోరుతూ సిపిఐ పార్టీ నాయకులు శుక్రవారం ఉరవకొండ పట్టణంలో ప్రభుత్వ,ప్రైవేటు,జూనియర్,డిగ్రీ కళాశాలలతో పాటు ఎంపీడీవో,తాసిల్దార్ కార్యాలయాలలో ప్రచారం చేపట్టారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కేశవరెడ్డి, ఉరవకొండ తాలూకా ప్రధాన కార్యదర్శి జె. మల్లికార్జున, సహాయ కార్యదర్శి మనోహర్, ఏఐటి యుసి తాలూకా కార్యదర్శి చెన్నారాయుడు, ఉరవకొండ మండల కార్యదర్శి తలారి మల్లికార్జున, వజ్రకరూరు కార్యదర్శి సుల్తాన్, రైతు సంఘం నాయకులు నాగరాజు తదితరులు ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img