Thursday, December 7, 2023
Thursday, December 7, 2023

పివికేకే పీజీ కళాశాలలో ఘనంగా పల్లె జన్మదిన వేడుకలు

విశాలాంధ్ర-బుక్కరాయసముద్రం(అనంతపురం): పివి కేకే పీజీ కళాశాలలో ఆదివారం మాజీమంత్రి పల్లె రఘునాథ్‌ రెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని కళాశాలలో కేక్‌ కట్‌ చేసి, జన్మదిన వేడుకలను పీజీ కళాశాల ప్రిన్సిపల్‌ డా. వై. మునిక్రిష్ణా రెడ్డి, బాలాజీ డిఈ డి కళాశాల ప్రిన్సిపల్‌ కె వీర ప్రకాష్‌, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ చక్రధర్‌ పల్లె రఘునాథ్‌ రెడ్డి కి పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం పల్లె జన్మదిన వేడుకలను పురస్కరించుకుని అనాధ ఆశ్రమాల్లో బ్రెడ్‌ లు, నిత్యవసర వస్తువుల పంపిణీ చేశారు. ఇంజనీరింగ్‌ కళాశాలో పల్లె కేక్‌ కట్‌చేసి మనవడు వియాన్‌, మనవరాలు వన్ష్న కళశాల చైర్మెన్‌ పల్లె కిషోర్‌, కోడలు సింధూరారెడ్డి, యాజమాన్య ప్రతినిధి శ్రీకాంత్‌రెడ్డికి తినిపించారు. అనంతరం పార్టీ కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాసులు అభినందనలు తెలిపారు. ఈకార్యక్రమంలో బోధన బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img