Wednesday, March 29, 2023
Wednesday, March 29, 2023

పి సి పి ఎన్ డి టి చట్టంపై జిల్లా స్థాయి సమావేశం

విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నందు గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చట్టం అమలులో భాగంగా( పి సి పి ఎన్ డి టి ఆక్ట్ ఇంప్లిమెంటేషన్) లో జిల్లా స్థాయి సలహా కమిటీ ( డిస్టిక్ లెవెల్ అడ్వైజరీ కమిటీ ) సమావేశము చైర్మన్ డాక్టర్ కె.విరబ్బాయి డిఎం అండ్ హెచ్ ఓ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో నిర్వహించడం జరిగింది అందులో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మాట్లాడుతూ… అబార్షన్స్ ఎక్కువగా జరుగుతున్న ప్రైవేట్ హాస్పిటల్ గుర్తించి వాటిపై సమగ్ర విశ్లేషణ రిపోర్టు అందించాలని కోరారు. పి సి పి ఎన్ డి టి యాక్ట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ పి. యుగంధర్ డి ఐ ఓ మాట్లాడుతూ… లింగ నిర్ధారణ కార్యక్రమాలకు పాల్పడుతున్న స్కానింగ్ కేంద్రం నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో రిజిస్ట్రేషన్ లేకుండా స్కానింగ్ సెంటర్లు నిర్వహించరాదని స్కానింగ్ సెంటర్ల ను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించి నిబంధనలు అతిక్రమించిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. లింగ నిష్పత్తి తక్కువగా ఉన్న మరియు ఎక్కువగా ఉన్న మండలాలను గుర్తించి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. వివాహ వయస్సు పై గ్రామస్థాయిలో సమావేశాలు నిర్వహించి బాల్యవివాహాలను అరికట్టాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు డాక్టర్ సుజాత, డాక్టర్ అనుపమ జేమ్స్ డాక్టర్ చెన్నకేశవులు, డాక్టర్ నారాయణస్వామి, రేడియాలజిస్ట్ డాక్టర్ సురేష్, పీడియాట్రిషన్ సంజీవప్ప గైనకాలజిస్ట్ విజయలక్ష్మి, జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ హరినాథ్ రెడ్డి పి డి ఎ సి డి శ్రీదేవి,సిరప్ప ఆర్డిటి భానుజా రెడ్స్, డెమో భారతి డిప్యూటీ డెమో త్యాగరాజు ఎస్ ఓ మారుతి ప్రసాద్, సుబ్రహ్మణ్యం, వేణుగోపాల్ లీగల్ అడ్వైజర్ ఆషారాణి తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img