Tuesday, March 28, 2023
Tuesday, March 28, 2023

పీర్ల చావిడికి విరాళం ఇచ్చిన ఎమ్మెల్యే సతీమణి

విశాలాంధ్ర-ధర్మవరం : ధర్మవరం నియోజకవర్గ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తో పాటు వారి సతీమణి సుప్రియ కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందించుటలో తన వంతుగా తాను గుడ్ మార్నింగ్ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటుంది. అంతేకాకుండా ప్రజలకు వైయస్సార్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా గట్టి చర్యలు తీసుకోవడంతో పాటు వారి సమస్యలను ఎమ్మెల్యే కూడా తెలియజేస్తున్నారు. అనంతరం సేవా కార్యక్రమాలు కూడా వారు అలవర్చుకున్నారు. ఇందులో భాగంగా నియోజకవర్గంలోని తాడిమర్రి మండలం ఎం అగ్రహారం గ్రామంలో నూతనంగా నిర్మించబోయే పీర్ల చావడి నిర్మాణానికి సుప్రియ మంగళవారం ఎమ్మెల్యే స్వగృహంలో 50 వేల రూపాయలు విరాళంగా కమిటీ పెద్దలకు అందజేశారు. తదుపరి పీర్ల చావడి కమిటీ సభ్యులు సుప్రియ కు కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img