విశాలాంధ్ర-ఉరవకొండ : ఉరవకొండ మండలం పెన్న హోబిలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికి సంబంధించి ఆరు శాశ్వత హుండీలను శుక్రవారం లెక్కించారు. 99 రోజులకు సంబంధించి రూ.18.33 లక్షల రూపాయలు భక్తుల నుంచి కానుకలుగా వచ్చినట్లు ఆలయ ఈవో విజయ్ కుమార్ తెలిపారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో యాడికి గ్రూప్ టెంపుల్ ఈవో దుర్గాప్రసాద్, హనుమాన్ సేవ సమితి సభ్యులు, ఆలయ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు