అసోసియేషన్ అధ్యక్షులు కె. క్రిష్టప్ప
విశాలాంధ్ర-ఉరవకొండ : ఉరవకొండ సబ్ ట్రెజరీ కార్యాలయము నుంచి పెన్షన్ పొందుతున్న పెన్షనర్లు అందరూ కూడా ఈ కేవైసీ ని తప్పనిసరిగా,తొందరగా చేసుకోవాలని ఉరవకొండ పెన్షనర్ల అసోసియేషన్ అధ్యక్షులు కె. క్రిష్టప్ప తెలిపారు. శనివారం ఉరవకొండలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సిఎఫ్ఎంఎస్ నెంబర్ తో మొబైల్ నెంబర్ లింక్ కాకున్నా మొబైల్ నెంబర్ తప్పుగా ఉన్న ఎస్ టి ఓ కార్యాలయం నందు సరిచేసుకోవాలన్నారు. అలాగే ఆధార్ నెంబర్ తో మొబైల్ నెంబర్ లింక్ కానట్లయితే పోస్ట్ ఆఫీస్ నందు లింక్ చేసుకోవాలన్నారు ఆ తర్వాత మాత్రమే ఈ కేవైసీ చేసుకోవడానికి అవకాశం ఉందని తెలిపారు. ఈ కేవైసీ ని విశ్రాంతి ఉద్యోగుల భవనమునందు, అలాగే ఎస్ టి ఓ కార్యాలయం ముందు ఉచితంగా చేయబడినని పేర్కొన్నారు. పెన్షనర్లు అందరూ కూడా తప్పనిసరిగా చేసుకోవాలన్నారు. దీనిపై ఎవరికైనా సందేహాలు అనుమానాలు ఉంటే విశ్రాంతి భవనంలో తెలుసుకోవాలన్నారు.