Tuesday, June 6, 2023
Tuesday, June 6, 2023

పేదల సంపదను కార్పొరేట్లకు దోచిపెడుతున్న మోడీని సాగనంపుదాం

విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ పట్టణము నందు మంగళవారం సిపిఐ డివిజన్ కార్యదర్శి శ్రీ రాముల నేతృత్వంలో సిపిఐ కార్యకర్తలు పెనుకొండ నగర పంచాయతీ పురవీధుల గుండా ప్రజలందరినీ మేల్కొల్పు యాత్ర ప్రచార భేరి యాత్రను కొనసాగించారు శ్రీరాములు మాట్లాడుతూ ప్రజల సంపదను కార్పొరేట్ సంస్థలకు కార్పొరేట్ దిగ్గజాలకు దోచిపెడుతున్న బిజెపి ప్రభుత్వాన్ని సాగునంపదం దేశాన్ని కాపాడుకుందాం ప్రజా వ్యతిరేక నిరంకుశ , మతోన్మాద రాజకీయాల వల్ల భారతదేశము బ్రష్టు పట్టిందని కావున బిజెపి ప్రభుత్వం హయాంలో దళిత గిరిజన మైనారిటీ సంక్షేమలు లేకుండా బీదవాడు మరింత బీదవాడు అవుతున్నారు కార్పొరేటర్ సంస్థలు మాత్రం రోజురోజుకు ఆదాయాలు పెంచుకుంటూ ధరలు విపరీతంగా పెంచుతూ ప్రజాసంక్షేమన్న విస్మరించి నిత్యావసర ధరలు పెట్రోలు డీజిల్ వంటి ధరలు విపరీతంగా పెరిగి ప్రతి చిన్న పనికి విపరీతమైన ధరలు పెరిగిపోయి సామాన్యుడు బతకడానికి భారమై అనేక ఇబ్బందులు గురవుతున్నారని కావున ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతికటించుటకు ఈ పాదయాత్రలను జయప్రదం చేయాలని ప్రజా ప్రచార సభలను జయప్రదం చేయాలని ప్రజలు మేల్కొనాలని దేశ సమైక్యత కోసం సమగ్రత కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం సామాన్య ప్రజల రక్షణ ప్రధాన కర్తవ్యం గా సిపిఐ పార్టీ కృషి చేస్తుందని అందరూ పార్టీకి అండగా నిలవాలని కోరారు రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం నోరు మెదపకుండా కేంద్రం ప్రభుత్వం ఏమి చెపితే అది చేస్తూ రైతులకు మోటార్లకు మీటర్ల బిగించడం విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయడం ఇసుక వ్యాపారం చేయడం అక్రమ మద్యం వ్యాపారం చేయడం అనేక కేసులలో ప్రభుత్వ పెద్దలు కూరుకుపోయి ఉన్నందున కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని కావున వైఎస్ఆర్సిపి ప్రభుత్వం తమ పేపరు ఛానల్ ద్వారా డబ్బా కొట్టుకుంటూ అభివృద్ధిని గ్రాఫిక్ లో చూపిస్తున్నారని కేంద్ర ప్రభుత్వం నిరంకుషత్వ పరిపాలనకు రాష్ట్ర ప్రభుత్వము వత్తాసు పలుకుతున్నదని రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను గాలికి వదిలేసి అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వంపై దూయబట్టారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి నరసింహ, మల్లికార్జున, వెంకట లక్ష్మమ్మ అనేకమంది మహిళలు సిపిఐ కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img