విశాలాంధ్ర-తాడిపత్రి : నియోజకవర్గంగా నియోజకవర్గ వ్యాప్తంగా తమ దృష్టికి వచ్చిన పేదవారి కష్టాలను తమ కష్టంగా భావించి వారి కష్టాలను తీర్చడమే తమ లక్ష్యంగా ముందుకు వెళ్తామని ఫయాజ్ భాష సేవా ట్రస్ట్ వ్యవస్థాపకుడు ఫయాజ్ భాష ఉద్ఘాటించారు. శుక్రవారం పట్టణంలోని షాదీ ఖానా లో ఫయాజ్ భాష సేవ ట్రస్ట్ ్రఆధ్వర్యంలో క్షయ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారం అందించే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఫయాజ్ భాషా సేవా ట్రస్ట్ వ్యవస్థాపకుడు ఫయాజ్ భాష హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షయ వ్యాధిగ్రస్తులు క్రమం తప్పకుండా పౌష్టికాహారం భుజించడం, మందులు వాడటంతో త్వరగా వ్యాధి నయమవుతుందని సూచించారు. అలాగే నియోజకవర్గ, పట్టణంలో ఎవరైనా పేదవారు ఆరోగ్యపరంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉంటే తమ దృష్టికి తెచ్చిన వెంటనే వారి కష్టం మా కష్టంగా భావించి సహాయ సహకారాలు అందిస్తా మన్నారు. అనంతరం క్షయ వ్యాధిగ్రస్తులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. వక్ బోర్డ్ అధ్యక్షుడు షాషావలి ఉపాధ్యక్షుడు వై. మహబూబ్ భాష, డైరెక్టర్ ఎస్. ఎన్.ఆలీబాబా పోట్ల షఫీ కొడవలపల్లి వలి డాక్టర్ విజయ్ వైసిపి నాయకులు చవ్వా రాజశేఖర్ రెడ్డి, ఉమ్మడి గురు ప్రసాద్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, ఆగిరప్ప పాల్గొన్నారు.